సిరి న్యూస్, గుమ్మడిదల : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు.ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై విశ్లేషణ చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి జరుగుతున్న కృషిని వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భోజ్ రెడ్డి సంతోష్ రెడ్డి కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.