జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్
మహాత్మా జ్యోతి బా పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు
సంగారెడ్డి, జనవరి 9 ( సిరి న్యూస్ ) : .జాతీయ న్యాయ సేవాధికార సంస్థ,రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ,జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానిచంద్ర ఆదేశాల ప్రకారం గురువారం మహాత్మా జ్యోతి బా పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ,సంగారెడ్డి నందు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ , మాట్లాడుతూ పిల్లలకు అన్ని చట్టాలపైనా అవగాహన ఉండాలి అన్నారు.
అందరు క్రమశిక్షణగా ఉండాలి అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు అదేవిదంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని తేలిపారు. విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత ఎదుగుదల ఎదగాలని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించగలరు.మరియూ జడ్జి విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు.అక్కడ హాస్టల్ వార్డెన్ ని పిల్లలకు అందించే ఆహారం, వసతి వివరాలు అదిగి తెలుసుకున్నారు.ఈ సదస్సు నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.