సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

Cheruku Srinivas Reddy presented the CMRF cheques.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద ప్రజలకు ఆర్థిక భరోసా..
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

చేగుంట : సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల పరిధిలోనీ నిరుపేదలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చేగుంట జంగళ సాయికుమార్ యాదవ్ కు రూ.37,500/- రూపాయల, అన్నసాగర్ గ్రామానికి చెందిన, వెంకటేష్ గారి శంకుతల కు 60,000 వెల చెక్కు ను, చేగుంట కు చెందిన రూబీనా సుల్తాన్ 60,000,రూపాయలు చెక్కు ను, బత్తుల కుమారయ్య 30,000 వల్లభపూర్ గ్రామనికి చెందిన బాధితులకు చెక్కు రూపేణా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ,అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు.ఈ మేరకు వైద్య చికిత్సకు సహకారం అందించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పేట్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుర్మ లక్ష్మి, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి,భూంలింగాగౌడ్,,ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, ఏ ఎం సి మాజీ చైర్మన్ వెంగల్ రావు,మాజీ సర్పంచ్ భాస్కర్,అయిత పరంజ్యోతి, నాగేష్ గుప్తా, జగన్ గౌడ్ స్వామి,ఆగమయ్యా, బాలిరెడ్డి, రాజా గౌడ్,తదితరులు పాల్గొన్నారు.