రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

44వ జాతీయ రహదారి పై ఘటన

మెదక్ ప్రతినిది, జనవరి 30 (సిరి న్యూస్) : రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటన గురువారం నాడు రాత్రి నార్సింగి మండల పరిధిలోని వల్లూరు వద్ద44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పైనుండి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులికి తీవ్ర గాయాలవ్వగా గాయాలతో తిరిగి అడవిలోకి చిరుత వెళ్తుండగా మరొక గుర్త తెలియని వాహనం ఢీకొనడం అక్కడికక్కడే మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పులి మృత దేహాన్ని అటవీ శాఖ అధికారుల డీఎఫ్ఓ జ్యోతి, రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ లకు అప్పజెప్పినట్లు తెలిపారు.