ఎంఎస్పి జిల్లా కార్యదర్శి గంద గళ్ళ ప్రసాద్.
హత్నూర: ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలుకై వెయ్యి గొంతులు లక్ష డప్పులతో చలో హైదరాబాద్ అని ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి గందగల ప్రసాద్ పిలుపునిచ్చారు. హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై లక్ష డబ్బులు వెయ్యి గొంతుల వాల్ పోస్టర్లు ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ లో నిర్వహించే మాదిగల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మాదిగలు లక్ష డబ్బులు వెయ్యి గొంతులతో సాంస్కృతిక ప్రదర్శనలతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మహా ప్రదర్శన ర్యాలీ ఎల్బీ స్టేడియం నుండి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి మాదిగ బిడ్డ డప్పులతో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా గౌరవ అధ్యక్షులు గంధ గల్ల వీరయ్య చిలక్చే డు మండల ఇన్చార్జి ఆశనుల, దుర్గా దాస్, ఎల్లయ్య, నవీన్, కృష్ణ నాగేష్ శంకర్ రవి తదితరులు మాదిగలు పాల్గొన్నారు.