గజ్వేల్ : ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధి కోమడిబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త ఉబ్బని స్వామి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది. సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బిఆర్ఎస్ కార్యకర్త మృతి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడం చాలా బాధాకరం గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని, వారు పార్టీకి చేసిన సేవను గుర్తు చేయడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బరాస మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కర్, ప్రభాకర్, తూం నర్సింలు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.