శభాష్ పల్లి లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పిఎసిఎస్ చైర్మన్

శివంపేట్ ఫిబ్రవరి 1 (సిరి న్యూస్ ) : శివంపేట్ మండల కేంద్రంలోని శభాష్ పల్లి గ్రామానికి చెందిన, నాలుగు కుటుంబాలకు హార్దిక సహాయం చేసిన పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం ఆరోగ్యంతో మరణించిన మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఆపద్బాంధవుడు శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి తన సొంత డబ్బులు, ఒక్కొక్క కుటుంబానికి కుటుంబానికి 5000 రూపాయల చొప్పున 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం మరణించిన కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

జోడు వెంకటేష్, రంగపల్లి నారాయణ, షేక్ హుస్సేన్ బి, మరియు పక్షవాతం వచ్చిన మస్కూరి సాయిలు కుటుంబానికి2000 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అయ్యగారి యాదగిరి, జోడు సత్యనారాయణ, అయ్యగారి నర్సింలు, అయ్యగారి ప్రశాంత్, షాదుల్లా, గంట నర్సింలు, గంట షాదుల్, అయ్యగారి ఆంజనేయులు, అయ్యగారి బాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.