సంగారెడ్డి, డిసెంబర్ 11(సిరిన్యూస్) : సిరి డిజిటల్ తెలుగు దినపత్రికను(Siri Digital News) సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరి మీడియా హౌజ్ (siri media house chairman) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాదె జయశ్రీ శివశంకర్‌రావు (Bade Jayasree Shivashankar Rao) దంపతులు ముందుగా కార్యాలయంలో లక్ష్మీగణపతి పూజ నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఛాంబర్, న్యూస్ డెస్క్‌తో పాటు సిరి టీవీ స్టూడియో, విజిటర్స్ గదిని ప్రారంభించారు.
న్యూస్ డెస్కులో (News Desk) కంప్యూటర్లను(Computers) స్విచ్ ఆన్ చేసి విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ జయశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా(Medak Combined) వార్తలే ఎజెండాగా అన్ని హంగులతో సిరి తెలుగు దినపత్రికను(Siri Telugu News Paper) ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రత్యేక ఎడిషన్లతో పాటు డిజిటల్ పేజీలను అందించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో నెలకొన్న సామాన్య ప్రజలు(people issues) ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి అందుకు పరిష్కారాన్ని అందించడమే మా పత్రిక ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కేవలం ఉమ్మడి జిల్లా వార్తలనే పరిగణలోకి తీసుకొని దినపత్రికను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ పత్రికల, ఛానళ్ళ జర్నలిస్టులు చంద్రశేఖర్‌రావు, రాజేందర్, యోగానందరెడ్డి, పరశురాం, నాయికోటి సుభాష్ సిరి పత్రిక జర్నలిస్టులు పాల్గొన్నారు.