దక్షిణాది రాష్ట్రాల వైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చూడలేదు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్..
సంగారెడ్డి: కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వంపై పక్షపాతం చూపుతుంది. రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది… తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారు … తెలంగాణ ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పాలి. తెలంగాణ లోని ఒక్క ప్రాజెక్టులకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. పబ్లిక్ సెక్టార్ స్థానంలో ఉపాధి కల్పన కోసం చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వలేదు. విద్యా, ఉపాధి అవకాశాలతోనే పేదరికాన్ని రూపు మాపవచ్చ…. కానీ వాటికి బడ్జెట్ లో ప్రాధాన్యం లేదన్నారు.