మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం హర్షనీయం..
ఎంఎస్ పి రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముం డ్రాతి కృష్ణ మాదగ..
గజ్వేల్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు రావడం హర్షనీయమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆదివారం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ,ఎమ్మార్పీఎస్ గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ శనిగరి రమేష్ మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఉబ్బానీ ఆంజనేయులు మాదిగ ల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముం డ్రాతి కృష్ణ మాదిగ,ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెబర్తి యాదగిరి మాదిగ,బెల్లి శ్యామల మాదిగ తదితరులు హజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ
30 ఏళ్లుగా మాదిగ, మాదిగ ఉప కులాల హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు.
మంద కృష్ణ మాదిగ వికలాంగులు, వృద్ధులు, వితంతులు,చిన్నపిల్లల గుండెజబ్బుల కోసం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేశారని, మంద కృష్ణ మాదిగ చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మాదిగల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మని మహేష్,వివిధ మండల కమిటీ అధ్యక్షులు చిన్నారాజి గారి కిషన్, అదాసు మహేష్,సంఘపురం రవి, మైస శ్రీకాంత్, కొమ్ము నవీన్, దబ్బేట రవి వివిధ గ్రామాల యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.