– పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రెస్ మీట్
ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తిన పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదు . అదాని ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదు. ముడుపుల కుంభకోణం నుంచి అదానిని రక్షించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదాని వ్యవహారం తేల్చాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత 55 లక్షల ఓట్లు పోలయ్యాయి.
చిన్న చిన్న సమస్యలపై స్పందించే ప్రధాని మోడీ మణిపూర్ సందర్శనకి వెళ్ళలేదు…దానిపై మాట్లాడలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ అదానిపై వ్యతిరేకంగా ఉన్నందుకే సీఎం రేవంత్ అదాని ఆఫర్ ని తిరస్కరించాడు. లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటే రైతుల పోరాటమే. వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటాయి.