జోగిపేట, జనవరి 20 సిరి న్యూస్ : జోగిపేటలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రొయ్యల సత్యంమాట్లాడుతూ రాబోయే సర్పంచి ఎలక్షన్లో బీఆర్ఎస్ బలోపేతం చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త ముందుండి బీఆర్ఎస్ జెండా ఎగరాలని సత్యం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరు గ్యారంటీలు ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు రాబోయే సర్పంచి ఎలక్షన్లో టిఆర్ఎస్ జెండా ఎగరవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, మాజీ ఎంపీపీ రామ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభూషణం, చాపల వెంకటేశం, మహేష్ యాదవ్, శంకర్, నాగరాజ్, రొయ్యల శేఖర్, ఆది అశోక్, పెండ గోపాల్, వెంకటరమణ, రఫీ, ఇమ్రాన్, బాంధవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.