గొర్రెలకు నీలి నాలుక టీకాలు

హత్నూర, జూలై 30, (సిరి న్యూస్)
గొర్రెలకు నీలి నాలుక టీకాలు ఉచితంగా పశువుల ఆసుపత్రి వైద్యులు వేయడం జరిగింది. హత్నూర మండలం లోని నవాబ్ పేట, దేవులపల్లి, బోరపట్ల, ఎల్లమ్మ గూడా, గ్రామాలలోని 670 గొర్రెలకు నీలి నాలుక టీకాలు పశువుల ఆసుపత్రి వైద్యులు బుధవారం ఉచితంగా వేయడం జరిగింది. ఈ టీకాలు 8 ఆగస్టు 2025 వరకు వేయడం జరుగుతుంది. గొర్రెలలో ఆర్బి వైరస్, వలన నీలి నాలుక వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి (క్యూలి కాయి డిస్ )అనే దోమ వలన వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలలో 105°- 106°జ్వరము,పెదవులు (మూతి) నాలుక వాపు రావడం దాని వలన మేత సరిగా తినలేకపోవడం జరుగుతుంది. పశువు నిరాశించిపోవడం, నాలుక నీలిరంగులోకి మారడం వలన ఈ వ్యాధికి నీలి నాలుక వ్యాధి అని పేరు వచ్చింది. ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు గొర్రెలు కాళ్లు కుంటడం వంటి జరుగుతుంది .ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది దీనికి సరైన చికిత్స లేదు, మండలంలోని అన్ని గ్రామాలలో పశువులు మేపే గొర్రెల కాపరులు గొర్రెలకు దోమల ద్వారా వ్యాపించే నీలి నాలుక వ్యాధి టీకాలను తప్పని సరిగా వేయించుకోవాలని,తమ గొర్రెల పక చోట నీరు నిలువ ఉండకుండా,దోమలు పెరగ కుండ చూసుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి తెలిపారు.