పటాన్ చెరు : భారతీయ జనతా పార్టీ పటాన్ చెరు 113వ డివిజన్ ప్రెసిడెంట్ గా నడిపి ఆనంద్ రెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నడిపి ఆనంద్ రెడ్డి.. తన నియామకానికి సహకరించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవి బాధ్యతలను నిష్టతో నిబద్ధతతో ప్రజా సమస్యలపై పోరాడుతానని అన్నారు. పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం పాటుపడతానని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలలో వివరిస్తామని అన్నారు. తనకు సహకరించిన ప్రతి జిల్లా, టౌన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.