మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్..
పెద్ద శంకరంపేట, సిరి న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీని పటిష్టత కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోనీ ఆయన నివాసంలో పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్, నారాయణఖేడ్ నియోజకవర్గ బిజెపి నాయకులు పత్రి రామకృష్ణ, సంజీవరెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ వారితో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బూత్ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధిక స్థానాలను గెలుపొందే లా కృషి చేయాల న్నారు. భారతదేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో ప్రజలందరికీ వివరించాలని పిలుపునిచ్చారు.