లక్ష్మణ్ కు స్వాగతం పలికిన బిజెపి నేత నెమలికొండ వేణుమాధవ్.

జనవరి 29 (సిరి న్యూస్) సదాశివపేట : బిజెపి ఎంపీలు లక్ష్మణ్ కొండా విశ్వేశ్వర రెడ్డి లు జహీరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా సదాశివపేటలో బిజెపి నేత నెమలికొండ వేణుమాధవ్ ఆధ్వర్యంలో ముంబై నేషనల్ హైవేపై బిజెపి నాయకులు స్వాగతం పలికారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి నేత మర్రి శశిధర్ రెడ్డిలకు స్వాగతం పలికి శాలువాలతో బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుమాధవ్ తో పాటు బిజెపి నేతలు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆదిత్య, జిల్లా జనరల్ సెక్రటరీ మాణిక్ రావు, మెదక్ పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్, రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, శేఖర్, శ్రీకాంత్, క్రిష్ణ, శ్రీశైలం, ఉప సర్పంచ్ శ్రీశైలం, శేఖర్, ప్రశాంత్, శివలింగం, ప్రసాద్ సుభాష్, నగేష్, నాగన్న, కాశినాథ్ తదితరులు పాల్గొన్నారు.