సంగారెడ్డి , జనవరి 6 సిరి న్యూస్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన తీరుకు నిరసనగా మాల మహానాడు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బిజెపి కార్యాలయాల ముట్టడిలో భాగంగా సోమవారం సంగారెడ్డిలో బిజెపి కార్యాలయాన్ని మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేశం నాయకత్వంలో పెద్ద ఎత్తున మాల సంఘాల నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బిజెపి కి అమిత్ షా కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముట్టడించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి జనార్ధన్,రవీందర్,గోపాల్ విజయరావ్,అనంతయ్య, పురుషోత్తం విశ్వనాథం ఆకాష్, దిలిపకుమార్,కర్ణాకర్ అనంతరం,ధనరాజ్, ఉదయ్ సదానందం మారుతి బీమ్ సేన ధనరాజ్ ప్రజా సంఘాల జేఏసీ వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.