నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పర్యావరణ కార్యకర్త పాలడుగు జ్ఞానేశ్వర్ గారికి భారత్ యువ పురస్కారం వరించింది. జ్ఞానేశ్వర్ గత తొమ్మిది సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణకై సైకిల్ యాత్రలు పాదయాత్రలు మొక్కలు నాటడం పర్యావరణహిత కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
మరుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతం నుండి జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడం పట్ల గ్రామస్తులు అభినందించారు. పలువురు ప్రజా ప్రతినిధులు జ్ఞానేశ్వర్ను అభినందించారు. ఈ అవార్డును భారత్ వికాసం సంగం భారత్ ఉత్సవ్ 7 భాగంగా కర్ణాటక రాష్ట్రం కల్బురిగి, లో ఈనెల 31 తారీఖున ప్రముఖుల చేత అందుకోనున్నారు. ఈ అవార్డు రావడం పట్ల జ్ఞానేశ్వర్ తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు.