మొబైల్ ఫోనే కొంప ముంచుతుంది
విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్
మెదక్ ప్రతినిధి, ఫిబ్రవరి 05 (సిరి న్యూస్): సైబర్ జాగృత దివాస్ ను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ పట్టణం లో గల తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ డిఎస్పి సుభాష్ చంద్ర భోస్ ఆధ్వర్యంలో బుధవారం నాడు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముక్యంగా వీటిలో క్రిప్టో కరెన్సీ మోసాలు, జంప్ డిపాజిట్ స్కామ్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుట తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా సెల్ ఫోన్ లతో ఉపయోగాలతో పాటు అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్, మెదక్ పట్టణ సిఐ నాగరాజు, ప్రిన్సిపల్ తారా సింగ్ , సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.