ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపికను చూసి ఓర్వలేక విమర్శలు
ఏనాడైనా గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకున్నారా….?
మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్
గజ్వేల్ జనవరి 24 (సిరి న్యూస్) : గత పడేండ్లు అధికారంలో ఉండి ఏనాడైనా గ్రామసభలు నిర్వహించి ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? అని గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఇచ్చిన హామీ ప్రకారం 6 పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలని లక్ష్యంతో గ్రామసభలు నిర్వహించి ప్రజల మధ్యనే లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
గజ్వేల్ పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఏనాడైనా గజ్వేల్ నియోజకవర్గం ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఏనాడైనా గజ్వేల్ కు వచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడు లేడని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో అధికారుల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు.నియోజవర్గానికి చెందిన కొంత మంది బిఆర్ఎస్ నేతలు తన ఉనికిని కాపాడుకోవడం కోసమే మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇందిరా పార్క్ నుంచి కోట మైసమ్మ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు నయా పైసా నష్టపరిహారం ఇవ్వకుండా ఇల్లు లేని నిరుపేదలుగ మార్చారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలని ప్రజలు కోరుకుంటుంటే ప్రజలకు చేరకుండా బిఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని సర్దార్ ఖాన్ ఘాటుగా విమర్శించారు.కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని తన వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజల సమస్యలు తీర్చాలని ఏం సి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వహీద్, సమీర్, జంగం రమేష్ గౌడ్, ఊడేం శ్రీనివాస్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, జాకీర్, అరుణ్ తదితరుల పాల్గొన్నారు.