గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృష
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
జిన్నారం జనవరి 17 (సిరి న్యూస్)
జిన్నారం మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. జిన్నారం కొడకంచి కొర్లకుంట సోలక్పల్లి వావిలాల జంగంపేట రాళ్లకత్వ గ్రామాల్లో సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతులపై ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి ప్రభుత్వం తరపున గ్రామలలో నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ శ్రీకాంత్ రెడ్డి వడ్డే కృష్ణ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.