జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ
సదాశివపేట: కార్యక్రమం అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (యు ఎఫ్ డబ్ల్యూ ఎస్) మరియు జడ్పిహెచ్ఎస్ స్కూల్ సదాశివపేట లో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పి సి పి ఎన్ డి టి యాక్ట్ (లింగ నిర్దారణ) మరియు ఆడపిల్ల ప్రాముఖ్యత,ఆరోగ్యం మరియు రక్త హీనత నివారణ చర్యలు వంటి అంశాలను వివరించారు.
జడ్పీహెచ్ఎస్ ,స్కూల్ లో ఋతు క్రమ పరిశుభ్రత మరియు కిషోర్ బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తలు, విద్య ప్రాముఖ్యత వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో, విద్యార్థులచే ఆశల చేత ప్రతిజ్ఞ చేయించటం జరిగింది. అదే విధంగా బాలికల పేరుతో మొక్కలు నాటడం జరిగింది. ఐసీడీఎస్ సీడీపీవో చంద్రకళ,మెడికల్ ఆఫీసర్ ప్రీతి,జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త పల్లవి,ఐసీడీఎస్ సూపర్వైజర్ మణెమ్మ, జీఎస్ విశాల, హాస్పిటల్ సిబ్బంది మరియు అంగన్వాడి టీచర్లు, ఆశలు, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.