మనోహరాబాద్: కటోరమైన నియమ నిబంధనలతో దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తులు ఇరుముడితో శబరి మలై యాత్రకు తరలి వెళ్లారు. బిజెపి రాష్ట్ర నాయకుడు మనోహరాబాద్ మండలం కాల్ల కల్ తాజా మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ తో పాటు అయ్యప్ప భక్తులు రంజిత్ రెడ్డి పలువురు భక్తులకు శనివారం మండలంలోని కాళ్ళ కల్ బంగారమ్మ దేవాలయంలో గురు స్వామి జగ్గ ప్రబాకర్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు ఇరుముడి కట్టారు. అనంతరం దేవాలయంలో భజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు పురం గిరిధర్ గురు స్వామి, కనిగిరి రవి, తుమ్మల రాజు గురు స్వాములు, ఐలేష్ యాదవ్, నత్తి బాలరాజ్, గుజ్జల స్వామి లు పాల్గొన్నారు.