అయోధ్య రామయ్య వార్షికోత్సవ ర్యాలీ

ayodhya-ramaiah-anniversary-rally
ayodhya-ramaiah-anniversary-rally

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

జిన్నారం : బొల్లారం మున్సిపాలిటీ(Bollaram Municipality) అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడిని ప్రతిష్టించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకల’ను బొల్లారం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయం నుంచి గాంధీ నగర్ రామ మందిరం వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు, యువకులు కాషాయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ర్యాలీలో జై శ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ దద్దరిల్లాయి. ర్యాలీ అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ… అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మున్సిపల్ ప్రజలకు, హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. రామ నామంతో సమస్త ప్రజలంతా సుఖ:సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, దిననాథ్, రాజారామ్, శ్రీమన్నారాయణ, నరేందర్, రవితేజ, రోహిత్, మా అంభి మహిళా సేవా సమితి సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు, యువకులు, ధర్మ ప్రచార సమితి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.