సిద్దిపేట, జనవరి 8 సిరి న్యూస్ః కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధులపై హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ సెమినార్లో భాగంగా ఫీల్డ్ విజిట్ లో సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న అసంక్రమిత వ్యాధుల కు అందుతున్న వైద్య సేవలను పార్థసారథి సేన్ శర్మ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర ప్రదేశ్ , ఆర్.వి కర్నన్ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ, ఆరాధన పట్నాయక్ మేనేజింగ్ డైరెక్టర్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, విజయ్ దయ రామ్ మేనేజింగ్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ చతిస్గడ్ ,డాక్టర్ భారతి దీక్షిత్ మేనేజింగ్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ రాజస్థాన్, ఇంద్రాణి కౌశల్ సీనియర్ ఈ ఏ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ,డాక్టర్ అకౌసరహి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ హెచ్ ఎం నాగాలాండ్ వివిధ రాష్ట్రాలకు చెందిన , ఎన్‌సీడీ కార్యక్రమ అధికారులు సిద్ధిపేట లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఎన్ సి డి సెంటర్ ను తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్, డయాలసిస్ సెంటర్, ములుగు, మర్కుక్, కుకునూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు మరియు మామిడియాల, నెమటూర్, ఎర్రవల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లను, బస్తీ దవాఖాన, కాలకుంట కాలనీ, పట్టణ ఆరోగ్య కేంద్రం నాసరపుర సందర్శించారు.
అక్కడ జరుగుతున్న అసంక్రమిక వ్యాధుల సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను, వారికి లభిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని వారికి అందిస్తున్న వైద్య సేవల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ అధికారుల బృందంతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి జిల్లాలో అసంక్రమిత వ్యాధుల వైద్య సేవలకొరకు ప్రభుత్వం కల్పించిన వైద్య సౌకర్యాలను, వైద్య సేవల వివరాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ విమల తామస్, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శాంతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.