సంగారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహనా కార్యక్రమం

సంగారెడ్డి, జనవరి 20 ( సిరి న్యూస్ ) : సంగారెడ్డి జిల్లా కేద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డా:కూన వేణు ఆధ్వర్యంలో పయనీర్స్ పాఠశాల సహకారంతో విద్యార్థులకు ఆటో డ్రైవర్లు డీసీఎం,లారీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పలు అంశాలను వివరించారు.

మిషన్ ( ఆర్ ఆర్ ఆర్) పేరుతో జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్, ట్రాఫిక్ సిఐ సుమన్, పయనీర్స్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి సిబ్బంది విజయ్ అశ్విన్ మరియు విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
.