గజ్వేల్ జనవరి 22(సిరి న్యూస్): రాణే బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో 38 వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు సేఫ్టీ కి సంబంధించిన కరపత్రాలు పంచుతూ వాహన చోదకులకు రోడ్ సేఫ్టీ, డ్రంకు అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం ,ఓవర్ స్పీడ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ కె.వీర్ భద్రయ్య మాట్లాడుతూ ద్వి చక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నియంత్రిత వేగంతో నడపాలని సూచించారు. అలాగే ఇతర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు నియమాలు పాటించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది ప్లాంట్ హెడ్ పి. రాజేందర్, వి. ఎస్ దామోదర్ సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ హెచ్. ఆర్ సురేందర్ రెడ్డి, వై.వేణు కుమార్ ఎగ్జిక్యూటివ్- హెచ్. ఆర్, పీ వీ ర్ స్ శాస్త్రి, రాజ శేఖర్, గణేష్, కే శ్రీనివాస్, శివ ప్రసాద్, నాగరాజు, సురేష్, ట్రాఫిక్ సీఐ మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.