మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నియామక పత్రం అందుకున్న భవాని

Avusula Bhavani has received the appointment letter as the Woman President of Medak District Congress Party
Avusula Bhavani has received the appointment letter as the Woman President of Medak District Congress Party

పెద్ద శంకరంపేట: హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు చేతుల మీదుగా బుధవారం పెద్ద శంకరంపేట కు చెందిన అవుసుల భవాని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నియామక పత్రం అందుకున్నారు. అనంతరం అవుసుల భవాని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు ను శాలువా, బొకేల తో సన్మానించారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టిష్టత కోసం తన వంతు నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. తనపై నమ్మకం ఉంచి, మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించినందుకు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.