అధైర్యపడవద్దు.. అండగా ఉంటా – ఆవుల రాజిరెడ్డి
నాణ్యమైన చికిత్స అందించాలని సూచన
శివంపేట్జ ,జనవరి 2 సిరి న్యూస్ : మెదక్ జిల్లా శివంపేట మండలం,చిన్న గొట్టిముక్కుల గ్రామ సమీపంలో టాటా ఏస్ ఆటో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో చిన్న గొట్టిముక్కుల గ్రామస్తులు గాయపడిన విషయం తెలుసుకొని మండల కేంద్రమైన శివంపేట లో గల శ్రీ సాయి నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న బాధితులను నర్సాపూర్ తాలూకా ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆవుల రాజి రెడ్డి పరామర్శించారు.
అధైర్యపడవద్దని అండగా మేముంటానని భరోసా కల్పించారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, ఫ్యాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసిలు లక్ష్మీకాంతం,కమలాపూల్ సింగ్,వారాల గణేష్,షేక్ అలీ,ఈసారపు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.