గొట్టిముక్కల సమీపంలో ఘటన..
నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు..
శివంపేట్: శివంపేట్ మండలం చిన్న గొట్టిముల గ్రామ శివారులో టాటా ఎస్ ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరంతా లక్ష్మాపూర్ గ్రామ శివారులో గల కస్టోడియన్ భూములను చదును చేయడానికి వెళ్తున్నారు. కానీ ఆ భూమి దగ్గర గుమ్మడిదల పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్న విషయం తెలుసుకొని సుమారు 50 మంది మహిళలు కలిసి ఆటోలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్తుండగా చిన్నగొట్టిముక్కల దగ్గర ఆటో బోల్తా పడింది. క్షతగాత్రులకు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నారు.