నారాయణఖేడ్ : తెల్లరేషన్ కార్డ్ ఉన్న ప్రతీ ఒక్కరికి లేబర్ కార్డ్ ఇవ్వాలని బంధనలు ఉన్న అధికారి మాత్రం తన ఇష్ట రాజ్యాంగ ప్రవర్తిస్తున్నాడు. దీంతో కార్మిక కర్షకులు చెప్పులు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారనీ CPI నాయకుడు చిరంజీవి తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. కార్డ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని డాక్యుమెంట్స్ తీసుకోచ్చిన వారందరికీ చేతులు, కాళ్ళు చూపించు
నీ చేతులకు మట్టిలేదు, కాళ్లకు దుమ్ములేదు, నీ బట్టలు తెల్లగా ఉన్నాయి, చెప్పులు మంచివి వేశావు కాబట్టి నువ్వు లేబర్ కావు హనీ, నిరుపేద లేబర్ ని నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు.
అదేవిధంగా ప్రతీ పేపర్ పై గజిటెడ్ సంతకం కావాలి లేనియెడల చెల్లుబాటు కాదు. అని వెనక్కి పంపిస్తున్నాడు అప్పుడప్పుడు మాత్రమే విధులకు హాజరయ్యే ఈ అధికారి ఆ కార్యాలయం కూడా ఎక్కడో మూలన విసిరేసినట్టు ఉండడంతో ఏ అధికారి కన్ను ఆ కార్యాలయం మీద పడకపోవడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా తయారయింది అని పలువురు కార్మికులు విమర్శిస్తున్నారు. ఆన్లైన్ అయినా తర్వాత కార్డ్ కోసం వచ్చిన వారిని హైదరాబాద్ ఆఫీసుకు వెళ్ళండి అంటూ బెదిరిస్తున్నారు.కార్మికులు గట్టిగ మాట్లాడితే ఇక్కడినుండి ఈ కార్యాలయాన్ని తీసేస్తాము సంగారెడ్డి, హైదరాబాద్ వెళ్లి పనులు చేసుకోండి అని లేబర్ను తిప్పి పంపిస్తున్నాడనీ సిపిఐ నాయకుడు చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు అశోక్, విజయ్, నరేష్, యాదగిరి, సాయిలు తదితరులు పాలుగోన్నారు.