ముత్తంగి గ్రామంలో అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం
అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు గ్రామస్తుల వినతి
పటాన్ చెరు, జనవరి 3 సిరి న్యూస్ : తెల్లాపూర్ మున్సిపల్ (Telapur Municipal) పరిధిలోని ముత్తంగి గ్రామం (Muttangi village)లో కొందరు వ్యక్తులు సొసైటీ పేరుతో చేపట్టిన నిర్మాణమును వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సొసైటీ పేరుతో నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించాలంటూ శుక్రవారం ముత్తంగి గ్రామస్తులు రాజేష్, దత్తు, సాయి, సురేష్ ల తో పాటు గ్రామస్తులు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోనిl ముత్తంగి గ్రామ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో 296లో గల ఖాళీ స్థలంలో కొంతమంది వ్యక్తులు సొసైటీ పేరుతో అక్రమంగా షెడ్డు ను నిర్మించడం జరిగిందన్నారు. గ్రామ పంచాయితీ నుంచి గాని, మున్సిపాలిటీ నుంచి గాని ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా నిర్మించడం జరిగిందన్నారు. కొందరు వ్యక్తులు సొసైటీ పేరుతో ఈ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతోపాటు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సురేష్, నందు, ప్రవీణ్, కుమార్, నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.