కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏట్ హోమ్

కార్యక్రమానికి సరైన జిల్లా ఉన్నతాధికారులు, పాత్రికేయులు.

జనవరి 26 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : 76వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కలెక్టర్ వల్లూరు క్రాంతి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నతాధికారులు , పాత్రికేయులు పాల్గొన్నారు. అధికారులు పరస్పరం రిపబ్లిక్ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకొని ఉత్సాహపూరిత వాతావరణంలో ఎట్ హోం కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు పలు సంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం అధికారులకు తేనీరుతో పాటు అల్పాహారం ను క్యాంపు కార్యాలయం సిబ్బంది అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ,భవాని చంద్ర, అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డి ఆర్ ఓ పద్మజ రాణి, జిల్లా అధికారులు ,పాత్రికేయులు , సిబ్బంది పాల్గొన్నారు.