మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలిసిన ఆశా వర్కర్లు

నారాయణఖేడ్ జనవరి 22 (సిరి న్యూస్) : మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి,ని బుధవారం నాడు ఆశా వర్కర్లు కలిసి త‌మ‌ గోడును వెల్లబోసుకున్నారు. ఆశా వర్కర్లు కు గత టీఆర్ఎస్ ప్రభుత్వం మా జీతాన్ని రూ.9000 పెంచారు. అని ఆశా వర్కర్లు గుర్తు చేశారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.18000 పెంచుతామని చెప్పి ఎన్నికలు గడిచి సంవత్సరం దాటుతున్న ఇంకా పెంచలేదు. మా గురించి పట్టించుకోక పోగా మమ్మల్ని కలిసి మాట్లాడే టైం కూడా ఇవ్వటంలేద అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మేమందరం కలిసికట్టుగా పనిచేసి మరలా కెసిఆర్ నే ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతోగెలిపించుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ ఆలీ, మాజీ సర్పంచ్ పండరి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రాములు, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిరయ్య, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, చంద్రప్ప, హనుమాన్లు, వెంకయ్య, తదితరులు ఉన్నారు.