గజ్వేల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎన్నెల్లి సురేందర్..
ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి..
గజ్వేల్ : పీడిత వర్గాల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ అని గజ్వేల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎన్నెల్లి సురేందర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆర్. సత్యనారాయణ మృతి పట్ల గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో, అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరాలను పీడితులకు ఆయుధాలుగా మలిచారని, జర్నలిజం అంటే సామాజిక బాధ్యత అంటూ నిరూపించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషిస్తూనే, సమాజానికి ఎంతోమంది జర్నలిస్టులను అందించారన్నారు. ఆయన బాట అనుసరణీయమని చెప్పుకొచ్చారు. వారితో సీనియర్ జర్నలిస్టులు సత్యనారాయణరావు, నాయిని యాదగిరి, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు బాల్ నర్సయ్య, సభ్యులు కిరణ్, అశోక్ గౌడ్, లక్ష్మినారాయణ, యూసుఫ్, సతీష్, లక్ష్మణ్, శ్రీనివాస్, స్వామి తదితరులున్నారు.