కలెక్టర్ అధ్యక్షతన అధికారుల సమన్వయ సమావేశం .
పరీక్షా సమయానికి అనుకూలంగా బస్సు సర్వీసులు నడపాలి.
పరీక్షా కేంద్రాలు, ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి శానిటేషన్ సమస్య తలెత్తకుండా గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలి.
జనవరి 28 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి :
మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారుల ను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలు, ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాల నిఘా లో పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిబ్రవరి 3 వ తేదీ నుండి జరిగే ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ ఒకేషనల్ కోర్సులకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్చ్ 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ప్రధాన పరీక్షలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు .
ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో పరీక్షలకు 15వేల 984 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలకు 1681 మొత్తం 17665 మంది విద్యార్థులు, మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నట్లు, ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 17,057, ఒకేషనల్ పరీక్షలకు 1431 మొత్తం 18488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం అన్నారు. పరీక్షల నిర్వహణలో ఇలాంటి లోటుపాట్లు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాలలో తాగునీటి సమస్య , పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం సివిల్స్ స్కాడ్స్ బృందం ,సిట్టింగ్ స్క్వాడ్ బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇన్విజిలేటర్లను తగినంత మందిని ఏర్పాటు చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ అధికారులకు సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖల అధికారులదని , అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, డివిజన్ల వారీగా ఆర్డీవోలు సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్ పరీక్షా కేంద్రాలలో తాగునీటి వసతి టాయిలెట్లు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్ష సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులతో అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా సమయాలకు అనుగుణంగా ఆయారూట్లలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా బస్సు సర్వీస్ లను నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఫిబ్రవరి 22 వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షా సమయం మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు రెండవ శనివారం, ఆదివారాలు సెలవు దినాలు కలుపుకొని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల ప్రిన్సిపల్స్ చేపట్టాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు అక్రమాలు జరగకుండా అవసరమైన పటిష్ట భద్రత ఏర్పాటు చేపట్టాలని పోలీసు ఇంటర్ బోర్డు అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన కలెక్టర్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్, జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి ,పోస్టల్ శాఖ సూపర్నెంట్ మురళి, ఆర్టీవో అరుణ, జిల్లాలోని వివిధ డివిజన్ల ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.