జోగిపేట క్రికెట్ టీం పైన ఘనవిజయం సాధించిన అందోల్ టీం

సిలారపు దామోదర్ రాజనర్సింహ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. అందోల్- జోగిపేట మున్సిపల్ పరిధిలో 18తేదీ నుండి టవర్నమెంట్ 26తేదీ వరకు ముగిశాయి, అందోల్ వర్సెస్ జోగిపేట ఫైనల్ రాగ ఆరు బంతుల్లో 16 రెండు ఎవరైతే చేస్తారో వారు విజయం సాధిస్తారని 17వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు అన్నారు. జోగుపేట టీం పైన అందోల్ టీం ఘన విజయం సాధించారు. గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ క్రికెట్ టీం కెప్టెన్ కుమ్మరి శివకుమార్ టీం కీ 20,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ జోగిపేట వారికి10.000రూపాయలు బహుమానం అందజేశాడు. దీనికి ముఖ్య అధ్యక్షత 17వ వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు వహించాడు. గెలుపొందిన వారికి కంగ్రాజులేషన్ అని రానున్న రోజుల్లో ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని మంత్రి అన్నారు. టోర్నమెంట్లో గెలుపు ఓటమి మంత్రి అన్నారు, అంతేకాకుండా 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు కీ కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు మంత్రి దామోద రాజనర్సింహ తెలియజేశారు.

అంతేకాకుండా చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ శాంతియుతంగా జరిగింది. అంతేకాకుండా మంత్రి గారి చేతుల మీద జోగిపేట సీఐ అనిల్ కుమార్ గారికి సిల్డ్ అందజేశాడు, జోగిపేట ఎస్సై పాండు గారికి కూడా మంత్రి గారి చేతుల మీదుగా సిల్డ్ అందజేశాడు, RDO పాండు,పుల్కల్ ఎస్సై క్రాంతి, మరియు జోగిపేట ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా వారికి కూడా చిట్టిబాబు మంత్రి గారి చేతుల మీదుగా సిల్డ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువకులు, డిప్యూటీ తాసిల్దార్ మధుకర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.