గజ్వేల్ : గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో తప్పనిసరిగా పెట్టాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి అన్నారు.గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950న భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించడం, దేశం గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తుందని జెండా ఆవిష్కరణ రొజున భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ పొటో తప్పని సరిగ పెట్టె విధంగా గజ్వేల్ డివిజన్ పరిదిలో అదేశాలివ్వాలని శుక్రవారం రోజు గజ్వేల్ ఆర్ డి ఓ చంద్రకళ కి డిబిఎఫ్ అద్వర్యంలో వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ రోజును గుర్తుచేసే వేడుకలు అద్భుతమైన సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలను కలిగి ఉంటాయని న్యూఢిల్లీలో, సాయుధ దళాల సిబ్బంది సైనిక బలాన్ని విస్తృతంగా ప్రదర్శిస్తూ కర్తవ్య మార్గంలో కవాతు చేస్తారన్నారు.
గొప్ప కవాతుతో ప్రారంభమైన వేడుకలు, రాజధాని న్యూఢిల్లీలో, రాష్ట్రపతి భవన్ (ప్రెసిడెంట్ హౌస్) సమీపంలోని రైసినా హిల్ నుంచి కర్తవ్య మార్గం వెంట, ఇండియా గేట్ దాటి, చారిత్రాత్మక ఎర్రకోట మీదుగా జరుగుతాయన్నారు. ఈ రోజున, కర్తవ్య మార్గంలో ఉత్సవ కవాతులు జరుగుతాయని, ఇది భారతదేశానికి నివాళిగా, భిన్నత్వంలో దాని ఏకత్వాన్ని సూచుస్తూందని తెలిపారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరు అదర్శంగా గొప్పగా జరుపుకునే జెండా ఆవుష్కరణ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ పరిధిలో ప్రతి జెండా ఆవిష్కరణ వద్ద మహనుబావుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ ప్రథిమను తప్పనిసరిగా పెట్టె విధంగా ఆదేశాలివ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు,మండల అద్యక్షులు ఊశగారి చంద్రం పాల్గొన్నారు.