బిటీ రోడ్ల మరమ్మత్తులకు 15 కోట్ల రూపాయల కేటాయింపు – మైనంపల్లి రోహిత్

– జి.ఓ.నెం. 59 ద్వారా నిధులను విడుదల చేసిన పంచాయితీరాజ్ శాఖ
– నియోజక వర్గంలో 30.72 కి.మీ.,ల రోడ్లకు మోక్షం
– మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

సిరి న్యూస్/ జనవరి 27 మెదక్ రూరల్ : మెదక్ నియోజక వర్గంలో బిటి రోడ్ల పునరుద్ధణకు రాష్ర్ట ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖ నుండి జి.ఓ.నెం. 59 ద్వారా 15 కోట్ల 10 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఇట్టి నిధులతో మెదక్ నియోజక వర్గంలో దాదాపు 30.72 కి.మీ.,ల రోడ్లకు మోక్షం లభించనున్నట్లు ఆయన తెలియజేశారు.

కాగా మెదక్ మండలంలోని నవాపేట నుండి మగ్దుంపూర్ బిటి రోడ్డు పనులకు 172 లక్షలు, పాపన్నపేట మండలంలోని నాగ్సాన్ పల్లి నుండి కొడపక వరకు బిటి రోడ్డు పనులకు 196 లక్షలు, రామాయంపేట మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి ఆరేపల్లి మీదుగా లక్ష్మాపూర్, కాట్రియాల్, దంతేపల్లి బిటి రోడ్డు పనులకు 424 లక్షలు, చిన్నశంకరంపేట మండలంలోని జడ్పి రోడ్డు నుండి మిర్జాపల్లి తాండ బిటి రోడ్డు పనులకు 50 లక్షలు, హావేళిఘణాపురం మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు పొల్కంపేట మీదుగా బూర్గుపల్లి వరకు బిటి రోడ్డు పనులకు 508 లక్షలు, చిన్నశంకరంపేట మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు చందంపేట నుండి రుద్రారం వరకు బిటి రోడ్డు పనులకు 80 లక్షలు, నిజాంపేట మండలంలోని నిజాంపేట మండలం నుండి చల్మెడ వరకు బిటి రోడ్డు పనులకు 80 లక్షల రూపాయలు కేటాయించినట్లు పేర్కోన్నారు. రానున్న రోజుల్లో మెదక్ నియోజక వర్గంలో రోడ్డు లేని పల్లెగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కోన్నారు.