సదాశివపేట : శ్రీ మాణిక్ ప్రభు కృపతో ప్రజలందరూ చల్లంగా ఉండాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. గురువారం నాడు బిఆర్ఎస్ నాయకుడు వాదోని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పూజా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతానని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంది తన వంతు నిస్వార్థ సేవలు అందిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడూరు రమేష్, శివరాజ్ పాటిల్, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, మాజీ. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ పెద్దలు చిదానందం, విశ్వేశ్వర్, విజయ్ కుమార్, కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి, ఇంద్ర మోహన్ గౌడ్, ఆకుల శివకుమార్,సాతాని శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.