సంగారెడ్డి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్..
సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం పై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక పారదర్శకంగా ఉండాలి. ఎకరం లోపు భూమి ఉన్న వారిని కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి.. వ్యవసాయ కూలీలకు ఇచ్చే రూ.12వేలు ఇవ్వాలి…1 గుంట భూమి ఉన్న వారికి రూ.250 రైతు భరోసా కింద వస్తే.. భూమి లేని వారికి రూ.12వేలు వస్తున్నాయి. 1 గుంట భూమి ఉండటం వల్ల ఆ కూలి నష్టపోతున్నాడు. కాంగ్రెస్ సర్కార్ తప్పుకు దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక అధికారులు సతమతం. ప్రభుత్వాన్ని తిట్టించుకునే సభలుగా మారిన గ్రామ సభలు . మంత్రులతో పాటు ఎమ్మెల్యే ను గౌరవించుకోవలసిన బాధ్యత ఉంది… ఎక్కడుంది ఆ గౌరవం…? ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు.
ఏడాదికే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకుల తప్పులకు అధికారులు బలవుతున్నారు… గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. రైతు భరోసా వానకాలం, యాసంగికి కలిపి 15వేల రూపాయలు ఇవ్వాలి. అక్కచెల్లమ్మలకు కెసిఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ..తులం బంగారం సంగతి. ..?మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది. ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నమన్నారు, ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలందరికీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి… పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వాలు, ఎస్సీ ఎస్టీ లకి ఇళ్ల కోసం ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.