జాతీయ జెండాను అవమానించిన ఏఈఓ మజీద్

AEO Majeed insulted the national flag
AEO Majeed insulted the national flag

వెల్దుర్తి : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జాతీయ జెండాను అధికారులు అవమానించారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ మజీద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ జెండా చిరిగిపోయిన జెండాను ఆవిష్కరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జాతీయ జెండాను అధికారులు అవమానించారని మండిపడ్డారు. ఈ విషయమై మండలం వ్యవసాయ శాఖ అధికారిని ఝాన్సీ వివరణ అడగగా ఈ విషయాన్ని మీరే రాదంతం చేస్తున్నారని జర్నలిస్టులపై మండిపడ్డారు.