సిరి న్యూస్.కొల్చారం మండలంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయింది.స్థానికంగా పనిచేసే అధికారులు కూడా ఆయనకే ప్రాధాన్యం ఇస్తు న్నారు. దీనికితోడు ఆ ఏఈ రెండేళ్ల ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేయడం బాగా కలిసిస్తోంది. ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నాడు. ఏ పని అయినా ఈయన రేటు కుదిరించిన జరుగుతుందన్న ఆరోపణలున్నాయి.అందుకను గుణంగానేఇదే మండలంలో పనిచేస్తున్న మరో లైన్మన్ను ఇటీవల బదిలీ చేశారు. అయితే అతను అక్క డికీ వెళ్లకుండా పాత స్థానంలోనే పనిచేస్తూ అవినీతి అక్ర మాలకు పాల్పడుతున్నాడు.
ఈయనతో ఓ అధికారి కుమ్మక్కైవినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతు న్నట్టు సమాచారం. ఆ లైన్మన్ ఓ రైతు నుంచి ట్రాన్స్ ఫార్మర్ కోసం రూ.15 వేలు తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఆ సొమ్ము సరిపోదని రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. అంత సొమ్ము ఇచ్చుకోలేని రైతు స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్తానని చెప్పడంతో రైతు దగ్గర నుంచి లైన మన్ జారుకున్నట్టు తెలిసింది.ఇంత జేస్తు అవినీతికి పాల్పడుతున్న ఈ అధికారి ఏఈ అహ్మద్ అలీ రెండు రోజుల క్రితం ఉన్న తాధికారుల నుండి ఉత్తమ అవార్డు అందుకున్నాడు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అక్రమాలకు పాల్పడుతు ఆఫీస్ లోనే దర్జాగా నిద్రిస్తున్న ఏఈ ఫై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.విషయం తెలుసుకుని న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్ట్ పాల్వంచ.రామకృష్ణ ను బూతులు తిడుతూ చేయి చేసుకున్న ఏఈ ఫై చట్టపరమైన చర్య తీసుకోవాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.