చిలిపిచేడ్ జనవరి 20 (సిరి న్యూస్) :మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలో శ్రీ చాముండేశ్వరి దేవి 42 వ వార్షికోత్సవంలో భాగంగా రెండవ రోజైన సోమవారం నాడు శ్రీ చాముండేశ్వరి మాత అమ్మవారిని మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల ఎస్సై నర్సింలు సిబ్బంది దుర్గాప్రసాద్ సత్యనారాయణలు పాల్గొన్నారు.