బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అదనపు కలెక్టర్ రాత్రి నిద్ర


విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్.

కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, పాఠశాల రికార్డులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.

శానిటేషన్ పై దృష్టి సారించాలని సిబ్బందికి సూచన.

జనవరి 27 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం రాత్రి సదాశివపేట మండల కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో రాత్రి నిద్ర చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంక్షేమ గురుకుల పాఠశాలలోని వంటగదిని, డైనింగ్ హాల్ ను, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రత ఇతర సానిటేషన్ పనులపై దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన కృషికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో మూడో తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు .

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు నిర్ణీత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, వార్డెన్ కవిత పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.