సిద్దిపేట : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరం లో బుధవారం సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి,జిల్లా ఇంచార్జి మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు జారి ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్దిదారులకు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అందివ్వాలని సూచించారు.
ముందుగా వీటికి క్షేత్రస్థాయిలో అవసరమైన బృందాల ఏర్పాటు ప్రక్రియ, ఏ రోజుకారోజు చేసే పని ఓక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. ఎంపిక చేసిన సిబ్బంది గ్రామాల్లో, మున్సిపాలిటీలలో పిల్డ్ వెరిఫికేషన్ అత్యంత పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలన్నారు. పిల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత లబ్దిదారుల ముసాయిదా జాబితను తయారు చెయ్యాలి. తర్వాత గ్రామాల్లో, మున్సిపాలిటీ లలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సభలు నిర్వహించి లబ్దిదారుల జాబిత, ప్రభుత్వం చేపడుతున్న పథకాల గుర్తి చర్చించాలన్నారు.
పూర్తి సమాచారాన్ని కంప్యూటరీకరణ చెయ్యాలని సూచించారు. అనంతరం జిల్లా మంత్రి వర్యులు సమక్షంలో ఆయా జాబితాను ఆమోదించుకుని గణతంత్ర దినోత్సవం నాడు లబ్దిదారులకు పత్రాలు పంపిణి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ గ్రామ స్థాయులో బృందాలకు పర్యవేక్షణ చెయ్యాల్సిందిగా ఎంపిడిఓ, తహసీల్దార్ లకు తెలిపారు. ఆయా మండలంలోని పుర్తి బాధ్యత మండల ప్రత్యేక అదికారులదే. సిబ్బందికి గాని ఇతర అదికారులకు ఎక్కడ ఎలాంటి సందేహలు ఎదురైన మీ ఫై అదికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అందరు అధికారులు సమన్వయంతో అర్హులైన ఏ ఓక్క లబ్ధిదారుని పేరు మిస్ కాకుండా పని చేయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డిఓలు సదానందం, చంద్రకళ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్యా, డిసిఎస్ఓ తనూజ, డిఏఓ రాధిక, హౌసింగ్ ప్రోగ్రామ్ ఆపిసర్ దామోదర్ రాం, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు,ఎంపిడిఓలు, ఎంపీఓలు, తదితరులు పాల్గొన్నారు.