జిల్లా దివ్యాంగుల సంఘం డిమాండ్..
సంగారెడ్డి : దివ్యాంగులను అవమానపరిచిన గజేంద్ర మహారాజ్ పై దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతి సమర్పించిన దివ్యంగుల నాయకులు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో గల అంతర్గామా గ్రామంలో పాదయాత్ర లో భాగంగా ఒక సభలో దివ్యాంగులను పరుష పదజాలంతో దూషించి యావత్ తెలంగాణలోని దివ్యాంగులను కించపరిచే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని దివ్యాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానాతో చట్టం ప్రకారం తగు న్యాయం చేయాలని సంగారెడ్డి దివ్యాంగుల సంఘం నాయకులు తలారి గోపాల్, మహేష్ కుమార్, వెంకటేశం, సుధాకర్, భీమ్, నవాజ్ పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.