పేద కుటుంబానికి ఏసిఎఫ్ ఫౌండేషన్ చేయూత

గజ్వేల్ జనవరి 16 సిరి న్యూస్: ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధి బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన దర్శనం నాగమణి అనారోగ్యం బారిన పడి మృతి చెందడం జరిగింది. నాగమణి భర్త నరసింహులుకు మానసిక స్థితి బాగోలేక భార్య చనిపోయిన విషయం కూడా తెలియని వైనం. నిరుపేద కుటుంబం నాగమణి నరసింహులు దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు చూడాల్సిన నాగమణి మరణంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు.

గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఏసీఎఫ్ ఫౌండేషన్ సభ్యులు పేద కుటుంబాన్ని సందర్శించి చిన్నారులను ఓదార్చారు. ఏ సి ఎఫ్ ఫౌండేషన్ తరుపున రూ.10 వేల నగదుతో పాటు, 50 కేజీల సన్నబియ్యం,18 రకాల నిత్యవసర సరుకులు చిన్నారులకు అంద జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెండం వెంకటేష్, వెన్నెల స్వామి, మధుబాబు, ఎల్లం రాజు, చింతకింది స్వామి, బాబు, భిక్షపతి, సత్యనారాయణ, పోయిల రమేశ్, నరసింగరావు, దుబ్బాసి రమేశ్ లు పాల్గొన్నారు.
.