తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు
చౌటకూర్, జనవరి 6 సిరి న్యూస్ : కొద్ది రోజులుగా చౌటకుర్ మండల్ పరిధిలోని తాడ్ దాన్ పల్లి సింధూర వెంచర్ వద్ద ఆర్ అండ్ బి రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగిపోయింది ఫలితంగా వాహనదారులు భయపడుతూ కల్వర్టు దాటాల్సిన పరిస్థితి నెలకొంది పుల్కల్ మండల్ కు రోజు ఎమ్మార్వో ఎంపీడీవో మండల అధికారులు అందరూ ఇలానే వెళ్తారు వాళ్లకు కనబడడం లేదా సింగూర్ ప్రాజెక్ట్ పర్యాటక కేంద్రానికి కూడా ఎన్నో కార్లు హైదరాబాద్ నుండి వస్తూ ఉంటారు.
కల్వర్టు వలన టు వీలర్ వాళ్లయితే కల్వర్టు రాగానే స్లో చేయకుంటే వెనకాల కూర్చున్న వాళ్లు పడిపోవడం జరుగుతుందని వాహనాల ఎక్సెల్ కమాన్ పట్టిలు డ్యామేజ్ అవుతున్నాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్వర్టు బాగు చేయాలని వాహనదారులు అంటున్నారు.