మాసాయిపేట జనవరి 9 (సిరి న్యూస్) : మాసాయిపేట మండలం శివారులోని చందాయిపేట రోడ్డు మార్గంలో వడ్డెర కూలి పని చేసుకునే వ్యక్తి 40 సంవత్సరాలు మద్యం బాగా సేవించి బైక్ మీద నుండి పడడంతో విపరీతమైన దెబ్బలు తగలడంతో రక్తం బయటకు రావడం జరిగింది స్పృహ కోల్పోయి రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. రోడ్డు మార్గంలో పోయేవారు వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి వెంటనే క్షతగాత్రుని అంబులెన్స్ లో తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులు మాసాయిపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా వివరాలు తెలుస్తున్నాయి.